ముక్త పదగ్రస్తం: తెలుగు పాటలలో శబ్దాలంకారాలు

నేను ఈ మధ్యనే దాసుభాషితం యాప్ లొ వెన్నెలకంటి గారి ముఖాముఖి విన్నాను. పాట రాయాలంటే కవికి పాండిత్యం, సంగీతం, పద ప్రయోగం లాంటివి ఉంటే సరిపోతాయి అనుకున్నాను. కాని ఈ ముఖాముఖిలో వెన్నెలకంటి గారు ఇవి సరిపోవు అని నిరూపించారు. డైరెక్టర్ కు పాట నచ్చాక కూడా ఇంకా బాగా రాయటానికి అవకాశం ఉందని తెలిసాక ఒక కొత్త పాట రాసారు (కొంతకాలం కొంతకాలం). సాహిత్యం తెలిసిన డైరెక్టర్ ముక్త పదగ్రస్తం అలంకారంతో పాట రాయగలరా... Continue Reading →

దొరసాని : ప్రేమ కవితలు

దొరసాని సినిమా చూస్తున్నప్పుడు, నాకు అందులోని ప్రేమకవితలు ఆసక్తికరంగ అనిపించాయి. కొన్ని సన్నివేశాల్లో హీరో రాసిన కవితల కరపత్రాలు గాలిలో ఎగురుతూ కనిపిస్తాయి. వాటిలో నిజంగా కవితలున్నాయా అని నాకు సందేహం వచ్చింది. అద్భుతంగా, డైరెక్టరు గారు శ్రమపడి నిజమైన కవితలు రాసుంచారు. ఈ సినిమాలో నేనేమైనా కవిత మిస్స్ అయ్యుంటే కామెంట్స్లో షేర్ చెయ్యండి. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం … నేను మేఘం, నువ్వు వర్షం… నేను కావ్యం, నువ్వు గానం …... Continue Reading →

How to type in Telugu

If you follow my blog, you might have already noticed that I write about two main topics - Telugu literature and Computer technologies. This is probably the first cross-post. Some of my posts in Telugu are very long and I spend months writing them. This involves a lot of typing. I have always been on... Continue Reading →

మహా ప్రస్థానం : కవితా ! ఓ కవితా !

ఏప్రిల్ ముప్పైవ తారీకు మహాకవి శ్రీశ్రీ గారి జన్మదినము. నా యుక్తవయస్సులో, మిల్లీనియంశ్రీశ్రీ అని కలం పేరుతో కొన్ని కవితలు రాసాను. పాఠ్యపుస్తకాలలో వారి కవితలు లేకున్ననూ వారి ప్రాబల్యము అటువంటిది. అవును ఎందుకు మహా ప్రస్థానం లొని కవితలు మన పాఠ్య క్రమంలో లేవు? కవిత్వం గురించి శ్రీశ్రీ గారు ఏమన్నారంటే : న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచేదంతా న్యాయం కాదు. కవిత్వం రాయడం గొప్పదే.. కానీ రాసేదంతా కవిత్వం కాదు. కవితను... Continue Reading →

మాయాబజార్ : చూపులు కలిసిన శుభవేళ

https://www.youtube.com/watch?v=nWSh8ga8-YQ మాయాబజార్ చలనచిత్రం తెలుగు ప్రజలకు చాలా ప్రియమైనది, ముఖ్యమైనది. పాత చిత్రాలు రుచించని ఈ తరం వాళ్ళు కూడా చూసి ఆనందించగలగటం కొంచెం విచిత్రమే. అనేక సంవత్సరాల ఎడబాటు తరువాత కలసిన చిననాటి ప్రేమికుల యొక్క భావోద్వేగాల ఈ యుగళగీతాన్ని మీరు ఆస్వాదిస్తారు అని కోరుకుంటున్నాను. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము ఉల్లాసముగా నేనూహించిన అందమే నీలో చిందెనులే చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయెనులే... Continue Reading →

అర్జున్ రెడ్డి : మధురం

ఈ చిత్రంలో నాకు బాగా నచ్చిన పాటలు - గుండెలోన మరియు మధురమే. ఈ రెండు పాటలు రాసినవారు శ్రేష్ఠ. ఈమె భావాలు, కొంచెం ఏకరీతిగా ఉన్న తెలుగు పాటలలో, ఒక కొత్త గొంతుకను వినిపిస్తున్నాయి. ఈ పాట సులువుగా అర్థం అయ్యేలా రాయటం జరిగింది కాని అన్ని పదాలు తెలియడం వలన ఈ పాటను మనం ఇంకా ఎక్కువగా ఆనందించవచ్చు.   మధురమే ఈ క్షణమే ఓ చెలి మధురమే ఈ క్షణమే మధురమే వీక్షణమే ఓ చెలి... Continue Reading →

స్వర్ణ కమలం : అందెల రవమిది

ఈ పాట మరో సిరివెన్నెల ఆణిముత్యం. ఈ పాటను అన్వయించే క్రమములో నేను తెలుసుకున్న విషయాలను, నా అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి తాత్పర్యం అనే విభాగం చేర్చబడినది. కాబట్టి మొత్తం చదవటానికి కొంచెం సమయం పడుతుంది. కాఫీ, టీ లాంటివి తెచ్చుకొని కూర్చోండి. https://www.youtube.com/watch?v=Z337PBBpuSw గురుః బ్రహ్మ గురుః విష్ణు గురుః దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మయిశ్రీ గురవేన్నమః ప్రతి పదార్థం : తస్మయి = అటువంటి ; శ్రీ = గౌరవసూచికము / పవిత్రమైన ; గురవేన్నమః = గురువు +... Continue Reading →

సిరివెన్నెల: విధాత తలపున

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు తెలియని తెలుగు వాడు అరదుగానైనా కనిపించవచ్చు కానీ అతని పాట విని తరించని తనువు వుండదు. "విధాత తలపున " అను ఈ గేయం సుపరిచితమైన ఆణిముత్యం. ఎన్నిసార్లు ఈ పాట  విన్నా ఏదో తెలియని  ఆనందం...  నాకు అర్థం కాకపోయినా  ఈ పాటలో  ఏదో గొప్ప విషయం వుంది అన్న ఒక సంతృప్తితో గడిపేసాను. కానీ నా ఈ ప్రయత్నముతో ఈ పాట యొక్క బహురూప సౌందర్యము ప్రత్యక్షముగా  కనిపించింది. నాకు... Continue Reading →

శంకరాభరణం: దొరకునా ఇటువంటి సేవ

పూజ్యులు వేటూరి సుందర రామ్మూర్తి గారి కలము నుండి జనించిన ఆణిముత్యమైన ఈ గేయాన్ని అర్థం చేసుకొనుటకు ఇది నా ప్రయత్నము. అర్థవంతమైన పాట రాయటం ఒక ఎత్తు అయితే సందర్భానుసారంగ, కవితాత్మకంగ, ఆలోచన రేకెత్తించే విధముగ రాయుట ఇంకొ ఎత్తు. ఈ పాట భావం చదివేముందు ఈ సన్నివేశాన్ని చూసి (దొరకునా ఇటువంటి సేవ) ఒకసారి సందర్భాన్ని నెమరువేసుకోండి. దొరకునా...దొరకునా...దొరకునా... దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయు త్రోవ ప్రతిపదార్థము: రాజీవము = తామర; నిర్వాణము... Continue Reading →

Create a free website or blog at WordPress.com.

Up ↑